తిరుమలలో వైభవంగా సూర్యప్రభ వాహనసేవ రేపు రథోత్సవం
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, చెక్కభజనలు, కోలాటాల నడుమ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.