ఏపీ పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన బాపట్ల టౌన్ సీఐ రాంబాబు
రిపోర్టర్: సునీల్
స్థలం: Bapatla, Andhra Pradesh
ప్రథమ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026లో బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేత రాంబాబును బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అభినందిస్తూ, మెడల్తో ఘనంగా సత్కరించారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని చాటిన రాంబాబుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.