పులివెందులలో జగన్ ప్రవర్తన వీధిరౌడీలా ఉందంటూ తెదేపా నేతల ధ్వజం
రిపోర్టర్: సురేష్
స్థలం: పులివెందుల
పులివెందులలో వైకాపా అధినేత జగన్ ప్రవర్తన వీధిరౌడీలా ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు తెదేపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలింగ్ సమయంలో వాహనాలతో ప్రదర్శన చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు మండిపడ్డారు. బెంగళూరు నుంచి వచ్చి జగన్ విధ్వంసం సృష్టించారని, సొంత నియోజకవర్గంలో ఓటు వేయకుండా పారిపోయారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ చులకన చేశారని, ఓటు వేయడానికి నిరాకరించి పారిపోవడం సిగ్గుచేటని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.