ఫుట్బాల్ సంచలనం హ్యారీ కేన్: బేయర్స్ మ్యూనిచ్ తో 2029 వరకు ఒప్పందం పొడిగింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: మ్యూనిచ్

జర్మన్ దిగ్గజ క్లబ్ బేయర్స్ మ్యూనిచ్ తో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ తన ఒప్పందాన్ని 2029 జూన్ వరకు పొడిగించినట్లు క్లబ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ వెల్లడించారు. తాను క్లబ్ లో కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోందని, మ్యూనిచ్ నగరంలో కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.