ఈనెల 29 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఈనెల 29 నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడపనున్నారు. విజయవాడలో కర్మయోగి మిషన్, ఉదయగిరిలో పల్లెపండగ కార్యక్రమాలతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీ, పింఛన్ల పంపిణీ, హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన మరియు ఐఐటీ సదస్సుల్లో ఆయన పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.