నితీశ్ కుమార్‌పై యూటర్న్: సమర్థుడంటూ ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: గోపి
స్థలం: పాట్నా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అత్యంత సమర్థవంతమైన నాయకులలో ఒకరని జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ కొనియాడారు. ఒకప్పుడు నితీశ్ పాలనను తీవ్రంగా విమర్శించిన ఆయన, ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో టాప్ నాయకుల జాబితాలో నితీశ్ ఉంటారని స్పష్టం చేశారు. ఇటీవల ఒక జెడియు ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా సమర్థించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.