షాకింగ్ ఘటన: తన చేతి రక్తమే నల్లులకు ఆహారంగా ఇస్తున్న సైంటిస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: గ్లౌసెస్టర్షైర్
బ్రిటన్ లోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతానికి చెందిన ఎంటమాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ నేలర్ తన పరిశోధనల కోసం విచిత్రమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆయన తన ఇంటి వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్ లో ఏకంగా అరవై వేల వరకు నల్లులను పెంచుతున్నారు. ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి సుమారు ఇరవై వేల నల్లులకు తన చేతి రక్తమే ఆహారంగా అందిస్తున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. నల్లుల నివారణ ఉత్పత్తుల పనితీరును పరీక్షించేందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.