ఆలేరు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఆలయ ఆదాయం నుంచి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు.