జగపతినగరం 4వ నంబరు ఎంపీటీసీగా చదరం చంటిబాబు విజయం
రిపోర్టర్: U.Srinivasarao
స్థలం: కిర్లంపూడి
కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ నాలుగో నంబరు ఎంపీటీసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదరం చంటిబాబు రెండువందల తొంబై రెండు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన అభిమానులతో సమావేశమై ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపుపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందనలు తెలియజేశారు.