ఉపాధ్యాయులపై దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై వైకాపా గూండాలు దాడికి పాల్పడితే, ఆ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, జగన్‌కు దమ్ముంటే ఉపాధ్యాయులపై జరిగిన దాడి వీడియో ఫుటేజ్‌లను గవర్నర్‌ ముందుంచాలని సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్లే ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చిపెట్టాయని తెలిపారు.