రవీంద్రభారతిలో అట్టహాసంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయని భాషా సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ఆడబిడ్డలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపురూపమైన పండుగ ఇదని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెలుగొందాలని వారు మనసారా ఆకాంక్షించారు.