బిడ్డ పుట్టిన 37 రోజుల్లోనే షూటింగ్కు దీపికా పదుకోన్ రీఎంట్రీ

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోన్ బిడ్డకు జన్మించిన కేవలం ముప్పై ఏడు రోజుల్లోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నట్లు స్వయంగా వెల్లడించారు. సినిమా విడుదల తేదీకి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంత త్వరగా సెట్స్లోకి అడుగుపెడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. సోమవారం నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్ర షూటింగ్లో ఆమె పాల్గొని పాటల చిత్రీకరణలో భాగం కానున్నారు. వృత్తి పట్ల ఆమె చూపుతున్న ఈ అంకితభావం పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.