పలాసలో కూలిన భారీ చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన ఉదయ్
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఇరవై ఆరవ వార్డు అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో కురిసిన భారీ వర్షాలకు ఈదురు గాలుల కారణంగా పెద్ద చెట్లు విద్యుత్ తీగలపై పడిపోయాయి. దీనివల్ల స్థానికంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన జనసేన ఇంచార్జ్ ఉదయ్ ఆధ్వర్యంలో చెట్లను తొలగించి ప్రజల ఇబ్బందులను తొలగించారు.