ఖమ్మంలో జనసేన తెలంగాణ శంఖారావం భారీ సభ నేడే

రిపోర్టర్: నరేష్ స్థలం: ఖమ్మం

తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజా పోరాటాలపై దృష్టి సారించేలా ఖమ్మం వేదికగా జనసేన పార్టీ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ శంఖారావం భారీ సభను నిర్వహిస్తోంది. ఎంబీ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై ఈ వేదికగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.