సినిమా ప్రియులకు బిగ్ అప్డేట్: జైలర్-2 టికెట్ ధరల పెంపునకు ఏపీ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
సూపర్స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం జైలర్-2 విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి థియేటర్లలో టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మాత్రమే పెంచిన ధరలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.