జమ్మూ కాశ్మీర్ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు జేకేబోస్ అక్టోబర్, నవంబర్ సెషన్ కు సంబంధించిన పదవ తరగతి పరీక్షల తేదీల షెడ్యూల్ ను విడుదల చేసింది. కాశ్మీర్ డివిజన్, జమ్మూ డివిజన్ వింటర్ జోన్ ప్రాంతాలు అలాగే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో అక్టోబర్ 19 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గణితం పరీక్షతో మొదలయ్యే ఈ పరీక్షలు నవంబర్ 18 వరకు వివిధ తేదీల్లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.