తిరుమలలో నేత్రపర్వంగా చక్రస్నానం: వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Tirupati
తిరుమలలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు మంగళవారం శ్రీశ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు శ్రీరామపట్టాభిషేకం అలంకారంలో మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. సుదర్శన చక్రత్తాళ్వార్లకు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించగా, విశేష సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ వేడుకల్లో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.