ముచ్చివోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన ఎస్ఎంసీ కమిటీ ఎన్నిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ నూతన సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికలలో చైర్మన్గా యం నాగరాజు, వైస్ చైర్మన్గా దండి రజని ఎంపికయ్యారు. మొత్తం పదిహేను మంది సభ్యులతో నూతన కమిటీ కొలువుదీరింది. పాఠశాల అభివృద్ధిలో కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని హెడ్మాస్టర్ జీపాలెం సురేష్ పిలుపునిచ్చారు.