సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కేటీఆర్ సిబ్బంది అరెస్టుతో ఉద్రిక్తత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లను మరో అక్రమ కేసులో అరెస్ట్ చేసేందుకు బొల్లారం పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో పాటు తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ సిబ్బందిని అక్కడే విచారించాలని డిమాండ్ చేశారు.