పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నదానం
రిపోర్టర్: సతీష్
స్థలం: పశ్చిమ గోదావరి
కుమార్తె, అల్లుడి తొలి వివాహ వేడుకను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబసభ్యులు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద రోగులు, పేదలకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేశారు. అలాగే మహిళలకు చీరలు, మగవారికి దుప్పట్లు పంపిణీ చేసి తమ కుటుంబం తరఫున సేవా గుణాన్ని చాటుకున్నారు.