మండల రాజు కుటుంబానికి రూ ఐదు లక్షల సాయం

రిపోర్టర్: సతీష్ స్థలం: Bhupalpally

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మండల రాజు రెండు వేల పదమూడు జూన్ ఇరవయ్యవ తేదీన ఉద్యమ సమయంలో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.