కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ టాపర్గా నిలిచిన ఐఐటీ ఇతను
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
కోటి రూపాయల వార్షిక వేతనం వచ్చే విదేశీ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ పరీక్షల్ లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు కనిషక్ కటారియా తెలిపారు. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సివిల్స్ వైపు అడుగులు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విజయం వెనుక తన తల్లిదండ్రులు, సోదరితో పాటు తన స్నేహితురాలి సహకారం ఎంతో ఉందని కటారియా ఆనందం వ్యక్తం చేశారు.