ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న 108 పైలట్ రమణయ్యకు ఆర్థిక సాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోటబొమ్మాళి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన 108 పైలట్ రమణయ్య ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 108 ఉద్యోగ మిత్రులు స్పందించి తమ వంతు సహాయంగా రూ.54,100 విరాళాన్ని సమకూర్చారు. తోటి ఉద్యోగులు రమణయ్యను నేరుగా పరామర్శించి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో తమను ఆదుకున్న ఉద్యోగ మిత్రులకు రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు.