దారుణం: లాడ్జిలో భార్యను బీర్ బాటిల్తో పొడిచి హతమార్చిన భర్త
రిపోర్టర్: వెంకట్
స్థలం: Annamayya District
అన్నమయ్య జిల్లాలోని ఒక లాడ్జిలో భార్యను భర్త బీర్ బాటిల్తో దారుణంగా పొడిచి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ఈ మేరకు పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. వివాదం కారణంగా నవీద్ భాష తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లాడ్జి నిర్వాహకుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.