కావలిలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. మూతపడిన బ్యాంకులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు మూకుమ్మడిగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఐదు రోజుల పనిదినాల హామీని అమలు చేయాలని, గత ఒప్పందాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద నిరసన తెలిపారు. ఈ ఆందోళన కారణంగా పట్టణంలో బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.