రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో ప్రతిభ చాటిన విద్యార్థిని తేజస్విని
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పి.తేజస్విని విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో ప్రతిభ చాటారు. ఎనర్జీ బాస్కెట్-2047 అంశంపై జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ శక్తి అనే అంశంపై తేజస్విని ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.