అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్

రిపోర్టర్: అశోక్ స్థలం: టెహ్రాన్

అమెరికాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు. యుద్ధాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఇప్పుడు వాషింగ్టన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వివాదాలను సైనిక చర్యల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని, అంతర్జాతీయ చట్టపరమైన నిబంధనల పరిధిలో ఒప్పందానికి సిద్ధమని ఆయన తెలిపారు.