జె.ఆర్ పురంలో ఘనంగా నిర్వహించిన హిందీ దివస్ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రణస్థలం

జె.ఆర్ పురం జెడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం రమణయ్య అధ్యక్షతన హిందీ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు బి. మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులందరితో హిందీ భాషా ప్రతిజ్ఞ చేయించి, మిఠాయిలు పంపిణీ చేయడంతో ఈ వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.