సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన గోపగోని నాగమణి కుటుంబానికి మంజూరైన 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్ద శ్రీకాంత్, ఆత్మ కమిటీ డైరెక్టర్ గోపవుని బాలయ్య, వార్డు మెంబర్లు మర్ల శ్రీను, శ్రీధర్, చంద్రశేఖర్, మర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సాయం అందినందుకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.