బీజీఎంఐ గేమర్స్‌కు క్రాఫ్టన్ ఇండియా భారీ సర్ప్రైజ్!

రిపోర్టర్: శివ స్థలం: India

బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమర్ల కోసం క్రాఫ్టన్ ఇండియా సరికొత్త ఒరిజినల్ క్యారెక్టర్ 'కియారా'ను పరిచయం చేస్తోంది. సెప్టెంబర్ 16న బీజీఎంఐ 4.6 అప్‌డేట్ రానుండగా, అక్టోబర్ 8 నుంచి ఈ కొత్త పాత్ర అందుబాటులోకి రానుంది. భారతీయ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాత్ర గేమింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చనుంది.