బీఆర్ఎస్ గెలుపుతోనే పట్టభద్రుల సమస్యలకు శాశ్వత పరిష్కారమన్న సట్టు తిరుమలేష్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ అన్నారు. రాజాపేటలో నిర్వహించిన పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో ఆరు వందల ఎనభై ఓట్లను నమోదు చేయించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.