తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పర్యటన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం
గాజువాక నియోజకవర్గం షీలానగర్ మరియు హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాలలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేడు స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా వరద నీరు చేరి ఇబ్బంది పడిన బాధిత కుటుంబాలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ ప్రభుత్వ పరంగా పూర్తి ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని విధమైన సహాయ సహకారాలు తక్షణమే అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా కల్పించారు.