కామారెడ్డి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కామారెడ్డి

కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు, సలహాదారుగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత మరియు హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణవర్ధన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.