ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసినట్లు అధికారులు తెలిపారు. స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ను విడుదల చేశామని, ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నవంబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమోషన్లు కోరుకునే ఉపాధ్యాయులకు ఇది సువర్ణావకాశమని తెలిపారు.