పాత నగరంలో ఘోర ప్రమాదం: కూలిన మూడు అంతస్తుల భవనం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలోని చావ్డీ బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం మూడు అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. గలీ సితారాలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే స్పందించిన ఆరు అగ్నిమాపక శకటాలు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. సీనియర్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.