నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా మొత్తం 500 క్లాస్-3 అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీన జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరడానికి అర్హులని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.