రైతన్న సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అడుగులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పొందూరు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా చిగిలిపల్లి పద్మావతి ఈరోజు ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు.