కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీడబ్ల్యూకు బీజేపీ మహిళా మోర్చా వినతి

రిపోర్టర్: శివ స్థలం: తూర్పు గోదావరి

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థినులపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు బిమోల్ అకోయిజామ్పై తక్షణమే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ కె. రహత్కర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆ పార్టీ నేత పురందేశ్వరి స్పష్టం చేశారు.