అమెరికాలో ఉత్కంఠగా నార్త్ కరోలినా మధ్యంతర ఎన్నికల రాజకీయ పోరు
రిపోర్టర్: సురేష్
స్థలం: North Carolina
అమెరికాలో రానున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో నార్త్ కరోలినా రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా మారుతున్నాయని విశ్లేషకులు వెల్లడించారు. సెనేట్ స్థానంతో పాటు ప్రతినిధుల సభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర దృష్టి సారించాయి. గత ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థులు మెజారిటీ ఓట్లు సాధించగా, ఈసారి కూడా తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కొత్త మ్యాప్‌ల ప్రకారం హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు స్పష్టం చేశారు.