తెలంగాణలో మరో అల్పపీడనం: అక్టోబర్ ముగింపుతో పాటు నవంబర్లో భారీ వర్షాలు

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

తెలంగాణలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని Telangana Weatherman వెల్లడించారు. ప్రస్తుతం ఆర్నాబ్ వాయుగుండం బలహీనపడుతూ తూర్పు తెలంగాణ జిల్లాలలో మోస్తరు వర్షాలను కురిపిస్తోందని పేర్కొన్నారు. ఈ వాయుగుండం పూర్తిగా తొలగిపోయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ముప్పై నుంచి వర్షాలు మళ్లీ ఊపందుకుంటాయని తెలిపారు. ముఖ్యంగా నవంబర్ ఒకటి నుంచి ఐదు వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయన స్పష్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.