ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక రీల్ మేకింగ్ పోటీలు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రజా సేవ, పౌర బాధ్యతలు మరియు దేశ నిర్మాణ భావనను పెంపొందించే లక్ష్యంతో విద్యా శాఖ మేరి సేవా మేరా సంకల్ప్ పేరుతో ప్రత్యేక రీల్ మేకింగ్ పోటీలను ప్రారంభించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 17 వరకు కొనసాగనుండగా, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు లఘు చిత్రాల ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలని అధికారులు సూచించారు.