మణిపూర్ లో ఘోరం: ఇరవై నాలుగు గంటల్ లో ఐదుగురు కుకీల దారుణ హత్య
రిపోర్టర్: వెంకట్
స్థలం: మణిపూర్
మణిపూర్ లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కుకీ తెగకు చెందిన ఐదుగురు వ్యక్తులు హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిందని మణిపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ వరుస హత్యలతో రాష్ట్రంలో నాగ, కుకీ తెగల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అదృశ్యమైన ఇద్దరు యువకుల మృతదేహాలను సేనాపతి జిల్లా సరిహద్దులో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణాలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.