భక్తిశ్రద్ధలతో పులకించిన కె కందులవారిపల్లి వినాయక ఉత్సవాలు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారి ప్రతిమకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నాయకులు కట్ట గుండయ్య నాయుడు, మాచిన విశ్వేశ్వర నాయుడు, రామాంజుల నాయుడు, మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రత్తిన సుధీర్ ఆహ్వానం మేరకు విచ్చేసిన నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కోలాటం ప్రదర్శన, అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి.