లంచాలకు తావులేకుండా అర్హులైన నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల బిల్లుల చెల్లింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఖమ్మం
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత కింద మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, రూపాయి లంచం ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి ప్రతి సోమవారం సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చివరి బిల్లును కూడా పూర్తి పారదర్శకతతో చెల్లిస్తామని ప్రభుత్వం తరఫున ఆయన భరోసా ఇచ్చారు.