తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ను కలిసిన సీపీఐ నేతలు
రిపోర్టర్: సురేష్
స్థలం: తాడేపల్లి
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ తదితరులు కలిశారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పలు కీలక అంశాలపై జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.