ఇసుక అక్రమ మైనింగ్ కట్టడిపై హైకోర్టు కీలక ఆదేశాలు: అధికారులపై ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: Amaravati
ఇసుక అక్రమ మైనింగ్ కట్టడి విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసిందని అమరావతి వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర అధ్యయనం చేసి మార్గదర్శకాలు రూపొందించాలని గనులు, రెవెన్యూ, అటవీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. శాఖల మధ్య సమన్వయం లోపించిందని ఆక్షేపించింది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో విఫలమైన అధికారులను బాధ్యుల్ని చేయాలని తేల్చిచెప్పింది. బాధ్యత మాది కాదంటూ అధికారులు ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటున్నారని మండిపడింది. ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది.