భారత వాయుసేన తరంగ్ శక్తి 2026 విన్యాసాల్లో తొలిసారి అమెరికా ఎఫ్ 35 జెట్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: జోధ్‌పూర్

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు జరగనున్న భారత వాయుసేన ప్రతిష్టాత్మక బహుళజాతి విన్యాసాలు తరంగ్ శక్తి 2026లో అమెరికాకు చెందిన ఐదవ తరగతి స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్ 35 తొలిసారిగా పాల్గొననుంది. ఈ మెగా విన్యాసాలలో అమెరికా, ఫ్రాన్స్, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ సహా మొత్తం 39 దేశాలు పాల్గొంటుండగా, రఫేల్, సుఖోయ్ ఎస్ యూ 30 ఎంకేఐ, స్వదేశీ తేజస్ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో గగనతలంలో తమ యుద్ధ విన్యాస ప్రతిభను ప్రదర్శించనున్నాయి.