సూర్యాపేట జాతీయ రహదారిపై కారు దగ్ధం డాక్టర్ సజీవ దహనం
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలమర్రి సమీపంలో వేగంగా వెళ్తున్న వోల్వో కారు అకస్మాత్తుగా డివైడర్ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం మృతుడు ఖమ్మంలోని మమత హాస్పిటల్కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.