ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు మరింత సులభంగా పౌర సేవలను అందించేందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారిక పోర్టల్ను ప్రారంభించారు. 1100 నంబర్కు ఫోన్ చేసి లేదా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా ఇంటికే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.