హైదరాబాద్ రాజేంద్రనగర్లో గంజాయి సమాచారమిచ్చాడనే అనుమానంతో యువకుడి హత్య
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో గంజాయి సమాచారం పోలీసులకు ఇస్తున్నాడనే అనుమానంతో మహమ్మద్ నసీరుద్దీన్ అహ్మద్ అనే యువకుడిని ఇద్దరు స్నేహితులు కత్తితో పొడిచి చంపినట్లు రాజేంద్రనగర్ డిసిపి ఎస్. శ్రీనివాస్ వెల్లడించారు. ఉప్పరపల్లికి చెందిన నిందితులు ఇలియాస్, షోయబ్ లు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే వద్ద నసీరుద్దీన్ తో వాగ్వాదానికి దిగి ఛాతిపై కత్తితో ఇద్దరు దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.